|
ఎడమ నుండి : లలితా గాయింకా, డా.పూర్ణిమ శర్మ, శ్యాంసుందర్ గాయింక, డా.ఋషబ్ దేవ్ శర్మ, జి. పరమేశ్వర్, డా.జే.ఎల్.రెడ్డీ, డా.రాదేశ్యం శుకల్, డా.ఎం.వెంకటేశ్వర్, డా.హేమ్రాజ్ మీణా, రవి శ్రీవాస్తవ్ మరియు ఓంప్రక్ష గాయింకా |
భారత దేశం లాంటి బహు భాషా సమాజం లో నేడు అనువాద ప్రక్రియ ఎంతో అవసరమైనదే కాక, ప్రయోజనకరమైనది. నిజానికి అనువాదమనే ఈ ప్రక్రియ విభిన్న భాషల మధ్య సేతు నిర్మాణ కార్యం లాంటిది. అనువాద ప్రక్రియలలో విశేషించి, సాహిత్యానువాదం ప్రత్యేకమైన వైశిష్ట్యాన్నిసంతరించుకోవటానికి కారణం, అది రెండు సాంప్రదాయాలను, సంస్కృతులనూ సామాజిక-సాంస్కృతిక వారసత్వ తర్జుమా అని ఆంగ్లం మరియు విదేశీ భాషా విశ్వవిద్యాలయం, హింది విభాగపు పూర్వ అధ్యక్షులు ప్రొ.యం. వెంకటేశ్వర్ గతం లో హైదరాబాదులో కమలాగోయింకా ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ఒక సాహితీ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ ప్రొ. ఋషభ్ దేవ్ శర్మ హింది కావ్యకృతి ‘ప్రేమ్ బానా రహే’ తెలుగు అనువాదం ‘ప్రేమ ఇలా సాగిపోనీ’ ఆవిష్కరణ సందర్భంగా అన్నారు. తొలుత అనువదించబడిన కావ్యకృతి గురించి ప్రసంగిస్తూ, ఈ కావ్యకృతిలో కవి ప్రేమ యొక్క విభిన్న దశలనూ, అతి సునిశితమైన సూక్షమైన అనుభూతులనూ మరియు ఉదాత్తమైన పరిణామాలనూ అతి మనోహరంగా చిత్రీకరించారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
జి.పరమేశ్వర్ ద్వారా అనువదించబడిన ఈ కావ్య సంగ్రహాన్ని గీతా దేవి గోయింకా అనువాద పురస్కార గ్రహీత ప్రొ. జె.యల్ రెడ్డి ఆవిష్కరించగా, పుస్తకపు తొలి ప్రతిని డా.పూర్ణిమా శర్మ స్వీకరించారు. కార్యక్రమ ఆరంభం లో ఆవిష్కృత పుస్తకం గురించి పరిచయం చేస్తూ ప్రొ. ఋషభ్ దేవ్ శర్మ మానవుని సామాజీకరణ లక్ష్యం గా ప్రేమ భావం యొక్క ప్రాధాన్యాన్ని ప్రతిపాదించే ఈ కావ్యకృతి ‘ప్రేమ్ బానా రహే’ గత సంవత్సరం ప్రచురింప బడినదనీ దానికి ప్రభావితులైన అనుభవజ్ఞుడైన తెలుగు అనువాదకులు, హింది భాషా సేవకులూ అయిన జి. పరమేశ్వర్ ఆత్మప్రేరణ తో, కవితలను అనువదించారని అన్నారు. తొలుత అనువాదకునికి కృతజ్ఞతలు తెలుపుతూ, పుష్పగుఛం సమర్పించి సన్మానించారు.
అనువాదకులు పరమేశ్వర్ మాట్లాడుతూ, ‘ప్రేమ్ బానా రహే’ కవితలు అతి సహజమైనవి, ప్రభావోత్తేజకమైనవి అనీ, ఐతే వీటిలో పౌరాణిక, శాస్త్రీయ మరియూ ఆధ్యాత్మిక సందర్భాలు లోతుగా ఇమిడివుండటం చేత అనువాదకునికి ఈ కావ్య సంగ్రహపు అనువాద కార్యం సవాలుగా నిలుస్తుంది అని అన్నారు. తదుపరి తన అనువాద అనుభవాలను వెల్లడిస్తూ, జానపద సాంస్కృతిక సందర్భాలనుగూర్చి , జనపద శబ్దాల యొక్క భాషా పరమైన ప్రయోగాలను ఎప్పటికప్పుడు రచయితతో చర్చించి అనువదించానని వివరించారు.
ఈ సందర్భంగా శ్యాంసుందర్ గోయంకా, లలితా గోయంకా, డా. రాధేశ్యామ్ శుక్ల్, ప్రొ. హేంరాజ్ మీణా, రవి శ్రీవాస్తవ్ మరియూ ఓంప్రకాశ్ గోయాంకా కూడా వేదికనలంకరించారు. సభాగారం లో ఆసీనులైన సాహిత్యకారులు, పాత్రికేయులు మరియూ హింది ప్రియులూ, కవికి, అనువాదకుకునికీ శుభాకాంక్షలు తెలియ చేశారు.
- భాగవతుల హేమలత
403, శ్రీ రాంప్రసాద్ రెసిడెన్సీ,
ఓల్డ్ ప్రతిభా నికేతన్ స్ట్రీట్,
మాచవరం, విజయవాడా – 520 004
हिंदी लिप्यंतरण
प्रॊ.ऋषभ् देव शर्म कवितल अनुवादं ‘प्रेम इला सागिपोनी’ आविष्करण
भारत देशं लांटि बहु भाषा समाजं लो नेडु अनुवाद प्रक्रिय एंतो अवसरमैनदे काक, प्रयोजनकरमैनदि. निजानिकि अनुवादमने ई प्रक्रिय विभिन्न भाषल मध्य सेतु निर्माण कार्यं लांटिदि. अनुवाद प्रक्रियललो विशेषिंचि, साहित्यानुवादं प्रत्येकमैन वैशिष्ट्यान्नि संतरिंचुकोवटानिकि कारणं, अदि रॆंडु सांप्रदायालनु, संस्कृतुल सामाजिक-सांस्कृतिक वारसत्व तर्जुमा अनि आंग्लं मरियु विदेशी भाषा विश्वविद्यालयं, हिंदि विभागपु पूर्व अध्यक्षुलु प्रॊ.एम. वॆंकटेश्वर् गतं लो हैदराबादुलो कमलागोयिंका फौंडेषन् वारु एर्पाटु चेसिन ऒक साहिती समावेशानिकि अध्यक्षत वहिस्तू प्रॊ. ऋषभ् देव शर्म हिंदि काव्यकृति ‘प्रेम बाना रहे’ तॆलुगु अनुवादं ‘प्रेम इला सागिपोनी’ आविष्करण संदर्भंगा अन्नारु. तॊलुत अनुवदिंचबडिन काव्यकृति गुरिंचि प्रसंगिस्तू, ई काव्यकृतिलो कवि प्रेम यॊक्क विभिन्न दशलनू, अति सुनिशितमैन सूक्षमैन अनुभूतुलनू मरियु उदात्तमैन परिणामालनू अति मनोहरंगा चित्रीकरिंचारनि तन अभिप्रायान्नि व्यक्तं चेशारु.
जी.परमेश्वर् द्वारा अनुवदिंचबडिन ई काव्य संग्रहान्नि गीता देवि गोयिंका अनुवाद पुरस्कार ग्रहीत प्रॊ. जॆ.यल् रॆड्डि आविष्करिंचगा, पुस्तकपु तॊलि प्रतिनि डा.पूर्णिमा शर्म स्वीकरिंचारु. कार्यक्रम आरंभं लो आविष्कृत पुस्तकं गुरिंचि परिचयं चेस्तू प्रॊ. ऋषभ् देव् शर्म मानवुनि सामाजीकरण लक्ष्यं गा प्रेम भावं यॊक्क प्राधान्यान्नि प्रतिपादिंचे ई काव्यकृति ‘प्रेम् बाना रहे’ गत संवत्सरं प्रचुरिंप बडिनदनी दानिकि प्रभावितुलैन अनुभवज्ञुडॆॖन तॆलुगु अनुवादकुलु, हिंदि भाषा सेवकुलू अयिन जि. परमेश्वर् आत्मप्रेरण तो, कवितलनु अनुवदिंचारनि अन्नारु. तॊलुत अनुवादकुनिकि कृतज्ञतलु तॆलुपुतू, पुष्पगुछं समर्पिंचि सन्मानिंचारु.
अनुवादकुलु परमेश्वर् माट्लाडुतू, ‘प्रेम् बाना रहे’ कवितलु अति सहजमैनवि, प्रभावोत्तेजकमैनवि अनी, ऐते वीटिलो पौराणिक, शास्त्रीय मरियू आध्यात्मिक संदर्भालु लोतुगा इमिडिवुंडटं चेत अनुवादकुनिकि ई काव्य संग्रहपु अनुवाद कार्यं सवालुगा निलुस्तुंदि अनि अन्नारु. तदुपरि तन अनुवाद अनुभवालनु वॆल्लडिस्तू, जानपद सांस्कृतिक संदर्भालनुगूर्चि , जनपद शब्दाल यॊक्क भाषा परमैन प्रयोगालनु ऎप्पटिकप्पुडु रचयिततो चर्चिंचि अनुवदिंचाननि विवरिंचारु.
ई संदर्भंगा श्यांसुंदर् गोयंका, ललिता गोयंका, डा. राधेश्याम् शुक्ल्, प्रॊ. हेंराज् मीणा, रवि श्रीवास्तव् मरियू ओंप्रकाश् गोयांका कूडा वेदिकनलंकरिंचारु. सभागारं लो आसीनुलैन साहित्यकारुलु, पात्रिकेयुलु मरियू हिंदि प्रियुलू, कविकि, अनुवादकुकुनिकी शुभाकांक्षलु तॆलिय चेशारु.
- भागवतुल हेमलत
403, श्री रांप्रसाद् रॆसिडॆन्सी,
ओल्ड् प्रतिभा निकेतन् स्ट्रीट्,
माचवरं, विजयवाडा – 520 004